'ఇంటి నుంచే యూరియా బుకింగ్'

'ఇంటి నుంచే యూరియా బుకింగ్'

ADB: రైతులకు యూరియా ఇబ్బందులు తగ్గించేందుకు ప్రభుత్వం ఫర్టిలైజర్ బుకింగ్ యాప్‌ను ఈనెల 20 నుంచి ప్రారంభించనుంది. యాప్ ద్వారా డీలర్, స్టాక్ వివరాలు తెలుసుకుని, ఇంటి నుంచే యూరియా బుక్ చేసుకోవచ్చు. షాప్‌ల వద్ద వాలంటీర్లు, వ్యవసాయ అధికారులు యాప్ వినియోగంపై అవగాహన కల్పిస్తారు. దీంతో క్యూలు, ఆలస్యాలు తగ్గి ఎరువుల పంపిణీ పారదర్శకంగా జరుగుతుందని అధికారులు తెలిపారు.