మొబైల్ ఆతివినియోగం వల్ల కలిగే అనర్ధాలపై అవగాహన

మొబైల్ ఆతివినియోగం వల్ల కలిగే అనర్ధాలపై అవగాహన

కృష్ణా: నేటి సమాజంలో మొబైల్ ఆతివినియోగం వల్ల కలిగే అనర్ధాలపై ప్రజలు గుర్తించాలని విజ్ఞప్తి చేస్తూ.. గుడివాడ ఏలూరు రోడ్డులోని ఫాదర్ బియాంకి పాఠశాల విద్యార్థులు శుక్రవారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పాఠశాల యంగ్ స్టూడెంట్ మూమెంట్ ఆధ్వర్యంలో గుడివాడ పురవీధుల్లో శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.