డీజీసీఏ నోటీసుపై ఇండిగో స్పందన

డీజీసీఏ నోటీసుపై ఇండిగో స్పందన

విమాన సర్వీసుల అంతరాయంపై డీజీసీఏ జారీ చేసిన షోకాజ్ నోటీసుకు విమానయాన సంస్థ ఇండిగో స్పందించింది. తాము చేసిన పొరపాటుకు క్షమాపణలు చెప్పింది. అనేక అనూహ్య అంశాలు ప్రభావం చూపడం వల్లే ఈ ఆటంకం ఏర్పడిందని తెలిపింది. ప్రస్తుతం సంస్థ కార్యాలయాల విస్తృతి దృష్ట్యా ఇప్పుడే కచ్చితమైన కారణాలను స్పష్టంగా చెప్పలేమని పేర్కొంది. మూల కారణాన్ని విశ్లేషించేందుకు సమయం కావాలని కోరింది.