కూతురి ముందే తల్లి ఆత్మహత్య

GNTR: తాడేపల్లిలోని సీతానగరం పుష్కర ఘాట్ వద్ద కన్నబిడ్డ ఎదుటే ఒక తల్లి కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. శనివారం సాయంత్రం విజయ భార్గవి అనే మహిళ తన కుమార్తె అనేక్యతో కలిసి ఘాట్‌కు వచ్చింది. చిన్నారి చూస్తుండగానే ఆమె నదిలోకి దూకింది. బిడ్డ ఏడుపు విని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఆచూకీ లభించలేదు.