'డెంగ్యూ విషయంలో భయాందోళన చెందవద్దు'

'డెంగ్యూ విషయంలో భయాందోళన చెందవద్దు'

SRCL: డెంగ్యూ విషయంలో ప్రజలు భయాందోళన చెందవద్దని సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత అన్నారు. ఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆమె తనిఖీ చేశారు. ప్రజలు డెంగ్యూ పై ఆందోళన చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సరైన జాగ్రత్తలు పాటించడం వల్ల సీజన్ వ్యాధులను అరికట్టవచ్చని స్పష్టం చేశారు.