కిసాన్ నగర్ చేపల మార్కెట్లో ఆకస్మిక తనిఖీలు

కిసాన్ నగర్ చేపల మార్కెట్లో ఆకస్మిక తనిఖీలు

NLR: నగరంలోని కిసాన్ నగర్ చేపల మార్కెట్లో కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ దినేశ్ బుధవారం ఉదయం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పలు దుకాణాల్లో చెడిపోయిన చేపలను గుర్తించి స్వాధీనం చేసుకుని పినాయిల్ పోసి నిర్వీర్యం చేశారు. నాణ్యతలేని ఆహార పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు కొనుగోలు ముందు నాణ్యతను పరిశీలించాలని తెలిపారు.