'ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలి'

'ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలి'

NLR: కొడవలూరు మండలంలోని గౌతమ్‌నగర్ అంగన్వాడీ కేంద్రంలో బుధవారం కిశోరి వికాసంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సూపర్‌వైజర్ నాగభూషణమ్మ బాల బాలికలు అందరికీ పరిసరాల పరిశుభ్రత గురించి అవగాహన చేశారు. చుట్టూ ఉన్న పరిసరాలను ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలన్నారు. అన్నం తినే ముందు ప్రతిరోజు చేతులను శుభ్రంగా కడుక్కోవాలన్నారు.