విషాదం.. యువతి ఆత్మహత్య

విషాదం.. యువతి ఆత్మహత్య

NLG: మిర్యాలగూడ మండలం చింతపల్లికి చెందిన బానోతు అనుజ(19) ఆత్మహత్య చేసుకోవడంతో ఆ ప్రాంతంలో విషాదం నింపింది. HYDలో సెల్ పాయింట్‌లో పనిచేస్తున్న ఆమె దసరా కోసం ఇంటికి వచ్చి అప్పటి నుంచి మానసిక వేదనకు గురవుతోంది. ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో గదిలోకి వెళ్లి ఉరి వేసుకుని చనిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న MLG గ్రామీణ పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.