VIDEO: ఇజ్జువరంలో అగ్నిప్రమాదం
SKLM: సంతబొమ్మాళి మండలం ఇజ్జువరం సమీపంలో ఉన్న పంట పొలాల్లో గురువారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రైతులు అక్కడే పశువులను మేపుతున్నడం వలన అప్రమత్తమయ్యారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. పరిసరాల్లోనే రైతులకు చెందిన గడ్డివాములు కుప్పలు వేసి పశువుల కోసం ఉంచారు. గ్రామస్తులు టెక్కలి అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించడంతో హుటాహుటిన వచ్చి మంటలు అదుపు చేశారు.