ఇద్దరు ఏఎస్సైలకు పదోన్నతి

నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇద్దరు ఏఎస్సైలకు ఎస్సైలుగా పదోన్నతి లభించింది. ఈమేరకు రాష్ట్ర డీజీపీ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు ఏఎస్సైలు సీపీ సాయిచైతన్యను మర్యాదపూర్వకంగా కలిశారు. సీపీ వారికి బ్యాడ్జీలను అందజేశారు. గత కొంతకాలంగా ప్రమోషన్ల ఎదురుచూస్తున్న ఏఎస్సైలకు ప్రమోషన్లు రావడంతో వారిలో ఆనందం వ్యక్తంచేశారు.