'గర్భిణీలు పోషకాహారాన్ని తీసుకోవాలి'
AKP: గర్భిణీలు, బాలింతలు ఆరోగ్యం కోసం పోషకాహారాన్ని తీసుకోవాలని ఐసీడీఎస్ సీడీపీవో లలిత కుమారి సూచించారు. ఈ మేరకు మంగళవారం పరవాడ మండలం వెన్నెలపాలెం-2 అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ పక్వాడ కార్యక్రమాన్ని నిర్వహించారు. పిల్లలను జంక్ ఫుడ్స్‌కు దూరంగా ఉంచాలన్నారు. పిల్లల ఆరోగ్యం పై ప్రత్యేకత తీసుకోవాలన్నారు. వారికి సకాలంలో వ్యాక్సినేషన్ వేయించాలన్నారు.