అనుమానంతో భార్యను చంపిన భర్త

అనుమానంతో భార్యను చంపిన భర్త

TG: సంగారెడ్డి జిల్లా బండ్లగూడ నేతాజీనగర్‌లో దారుణం జరిగింది. అనుమానంతో భార్యను భర్త చంపేశాడు. భార్య ఆర్తిదేవి (32)ని టవల్‌తో గొంతు బిగించి భర్త మాన్‌సింగ్‌ హతమార్చాడు. వివాహేతర సంబంధం కొనసాగిస్తుందనే అనుమానంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.