దాసరపల్లి వద్ద అదుపుతప్పి కారు బోల్తా

NLR: ఉదయగిరి మండలం దాసరపల్లి హైవే వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అడవి పందులు గుంపు రోడ్డు దాటుతుండగా వాటిని తప్పించబోయి కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. నెల్లూరు నుంచి సీతారాంపురం మండలం బసినేనిపల్లికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. కారులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వారికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. కారు ఫల్టీలు కొట్టి నుజ్జునుజ్జు అయింది.