వెంటనే గ్యాస్ ధరలు తగ్గించాలి: సీపీఎం
జనగాం: బచ్చన్నపేట మండలం చిన్నరామంచర్ల గ్రామంలో CPM మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా CPM మండల అశోక్, రాజు మాట్లాడుతూ.. కేంద్రం గ్యాస్ ధరలు పెంచి పేదల బతుకులను భారంగా మార్చిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన వంటగ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో CPM పార్టీ నేతలు ఉన్నారు.