VIDEO: బసులు ఆపడం లేదని విద్యార్థుల ధర్నా..!
GDWL: అయిజ మున్సిపాలిటీ పరిధిలోని పర్దిపురం స్టేజి దగ్గర బస్సులు ఆపడం లేదని ఆగ్రహించిన విద్యార్థులు మంగళవారం రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ప్రస్తుతం వచ్చే బస్సులు నిండి ఉండడం వలన ఇక్కడ ఆపడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల సమయంలో విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఒక బస్సును కేటాయించాలని విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులను కోరుతున్నారు.