VIDEO: 'పేదల సంక్షేమమే టీడీపీ లక్ష్యం'
ప్రకాశం: పేదల సంక్షేమమే టీడీపీ లక్ష్యమని ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కనిగిరిలో ఘనంగా నిర్వహించారు. టీడీపీ కార్యాలయంలో పార్టీ జెండాను ఎమ్మెల్యే ఆవిష్కరించి, కార్యకర్తలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందన్నారు.