‘లీఫ్‌ కటింగ్‌ ఆర్ట్‌’లో రాష్ట్ర స్థాయికి ఎంపికైన ధనవర్షిణి

‘లీఫ్‌ కటింగ్‌ ఆర్ట్‌’లో రాష్ట్ర స్థాయికి ఎంపికైన ధనవర్షిణి

కొయ్యలగూడెం జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని హేమ ధనవర్షిణి ‘లీఫ్‌ కటింగ్‌ ఆర్ట్‌’లో ప్రతిభ చాటి రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు ఎంపికైంది. జిల్లా స్థాయి ఈఎండీపీ పోటీల్లో స్వాతంత్య్ర సమరయోధులు, శాస్త్రవేత్తల చిత్రాలను ఆకులపై అద్భుతంగా చెక్కి ప్రథమ స్థానం సాధించిందని హెచ్‌ఎం ఉమాదేవి సోమవారం తెలిపారు. విద్యార్థిని సృజనాత్మకతను పలువురు అభినందించారు.