ఆదోనిలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం

ఆదోనిలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం

KRNL: ఆదోని అరుణ్ జ్యోతి నగర్ హెల్త్ సెంటర్ పరిధిలో గురువారం టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ త్రివేణి మాట్లాడుతూ.. 2027 నాటికి టీబీ వ్యాధిని నిర్మూలించాలన్న లక్ష్యంతో అవగాహన, సకాలంలో చికిత్స, సమాజ సహకారం అవసరమన్నారు. పాత రోగులు, ధూమపాన, మద్యపానం చేసే వారు, పోషకాహార లోపులున్న వారు అప్రమత్తంగా ఉండాలన్నారు.