సహాయక చర్యలో పాల్గొన్న పోలీసులు

సహాయక చర్యలో పాల్గొన్న పోలీసులు

AKP: మాకవరపాలెం మండలం జీ. కోడూరు గ్రామంలో గురువారం బొబ్బిలి గడ్డ వాగు పొంగిపోవడంతో ఊరంతా జలమయం అయింది. సమాచారం అందుకున్న రూరల్ సీఐ రేవతమ్మ, పోలీస్, రెవెన్యూ అధికారులతో కలిసి గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రోక్లైన్ పెట్టి ప్రత్యేక కాలువ ఏర్పాటు చేసి వాగులో నీరు వేరే దగ్గరికి తరలించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.