'యువత లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలి'

'యువత లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలి'

SRD: యువత లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని ఆదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువకులు ఉద్యోగం చేసే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని సూచించారు. కలలుకని సాధించుకుందాం అన్న అబ్దుల్ కలాం స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని పేర్కొన్నారు.