VIDEO: వేగేశ్వరపురం హై స్కూల్‌ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే
E.G: తాళ్ళపూడి(మం) వేగేశ్వరపురం ప్రభుత్వ హై స్కూల్‌ను కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వర రావు మంగళవారం తనిఖీ చేసి మధ్యాహ్న భోజన పధకాన్ని పరిశీలించారు. విద్యార్ధులతో మాట్లాడి, వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాల ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులకు అందించే ఆహారం విషయంలో ఎలాంటి లోపం చూపవద్దని సూచించారు.