అర్చకులకు న్యాయం చేస్తాం: ఇంఛార్జ్
KRNL: సనాతన ధర్మానికి సేవలందిస్తున్న అర్చకులను సమాజం గౌరవించాలని జనసేన ఆలూరు ఇంఛార్జ్ తెర్నేకల్ వెంకప్ప అన్నారు. ఇనాం భూముల ఆధార్ లింకింగ్ వల్ల అర్చక కుటుంబాలు సంక్షేమ పథకాల నుంచి దూరమయ్యాయని తెలిపారు. ఈ అంశంపై పత్తికొండ ఆర్డీఓకు లేఖ ఇచ్చామని, అర్చకుల కుటుంబాలకు న్యాయం జరిగేలా అండగా ఉంటామని పేర్కొన్నారు. ఇనాం భూముల అక్రమ కబ్జాలపై కూడా విచారణ చేస్తున్నారు.