'ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి'
KMR: పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు ఓటేసి గెలిపించిన ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సూచించారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలుపొందిన సర్పంచులకు శుక్రవారం పార్టీ కార్యాలయంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. గెలిచిన సర్పంచులపై గ్రామస్థులు ఉంచిన విశ్వాసం ఎంతో గొప్పదన్నారు.