రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

BDK: బూర్గంపహాడ్ మండల కేంద్రంలోని పీఏసీఎస్ (PACS) వ్యవసాయ కమిటీ కార్యాలయం ముందు గురువారం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తిగా వివరాలు తెలియాల్సి ఉంది.