మా వాళ్ళు మీ ఇంట్లో కూర్చుంటారు: ఎంపీ
KDP: జమ్మలమడుగు MLA ఆదినారాయణ రెడ్డి మర్యాదగా మాట్లాడాలని కడప ఎంపీ అవినాశ్ రెడ్డి హితవు పలికారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ... పులివెందుల పులులు ఎక్కడ అని ఆదినారాయణ అడుగుతున్నాడు. మా వాళ్లు సంయమనం పాటిస్తున్నారు కాబట్టే నువ్వు ఏవో కూతలు కూస్తున్నావ్. అది కోల్పోయినప్పుడు మీ ఇంట్లో వచ్చి కూర్చుంటారు అని ఎంపీ హెచ్చరించారు.