VIDEO: అదుపుతప్పి గుంతలో కూరుకుపోయిన అక్షయపాత్ర వాహనం

MDK: టేక్మాల్ మండలంలో శుక్రవారం అక్షయపాత్ర వాహనానికి పెను ప్రమాదం తప్పింది. స్థానికుల సమాచారం ప్రకారం, కుసంగి నుంచి ధనురా గ్రామం మీదుగా టేక్మాల్ గ్రామానికి వస్తున్న వాహనం అదుపుతప్పి రోడ్డుపక్కనున్న గుంతలో కూరుకుపోయింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లినర్ క్షేమంగా బయటపడ్డారు. వాహనానికి స్వల్పనష్టం మాత్రమే జరిగింది.