‘బీజేపీ చెప్పినట్లు ఈసీ ఆడుతోంది’
ఎన్నికల సంఘం (ఈసీ) BJP కనుసన్నల్లో పనిచేస్తోందని బెంగాల్ CM మమతా బెనర్జీ తీవ్రంగా ఆరోపించారు. BJP కార్యాలయం ఇచ్చే జాబితా ప్రకారమే సీనియర్ అధికారులను బదిలీ చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏవైనా అల్లర్లు జరిగితే ఈసీ, BJPదే బాధ్యతని హెచ్చరించారు. ఎన్నికల వేళ తమకు అనుకూలంగా ఉండేందుకు బయటి రాష్ట్రాల నుంచి అధికారులను తెప్పిస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు.