VIDEO: శివాలయ పునర్నిర్మాణానికి గ్రామస్థుల శ్రీకారం

VIDEO: శివాలయ పునర్నిర్మాణానికి గ్రామస్థుల శ్రీకారం

GDWL: వడ్డేపల్లి మండలం జూలేకల్లోని పురాతన ఈశ్వర ఆలయ పునర్నిర్మాణ పనులు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. శిథిలావస్థకు చేరిన ఆలయాన్ని చూసి చలించిన గ్రామస్థులు, భక్తులు ఏకమై నూతన ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించారు. ఇందులో భాగంగా జేసీబీతో పాత కట్టడాన్ని తొలగించి, ప్రత్యేక పూజలు నిర్వహించి పనులకు నాంది పలికారు.