'రైతు బాగుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ముందుకు సాగుతుంది'
NTR: రైతు బాగుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య స్పష్టం చేశారు. ఖరీఫ్ 2025–26 సీజన్‌లో కందులు(రెడ్‌గ్రామ్), పెసర(గ్రీన్‌గ్రామ్), మినుములు(బ్లాక్‌గ్రామ్) వంటి పప్పుదినుసుల కొనుగోలును నాఫెడ్ (NAFED), ఎన్‌సీసీఎఫ్ (NCCF) సంస్థల ద్వారా ప్రైస్ సపోర్ట్ స్కీమ్ కింద అమలు చేయనున్నట్లు ఆమె ఓ ప్రకటనలో తెలిపారు.