VIDEO: గ్రామంలో చిరుతలతో భయాందోళన

NGKL: అమ్రాబాద్ మండలం దోమలపెంట, ఈగలపెంట, పాతాళగంగ గ్రామాల్లో చిరుతల సంచారం గ్రామస్తులను భయాందోళనకు గురి చేస్తోంది. ఇటీవల దోమలపెంటలో కొండేటి సంతోషమ్మ ఇంటి ఆవరణలో కట్టేసిన ఆవుదూడపై చిరుత దాడి చేసి గాయపరిచింది. గురువారం తెల్లవారు జామున రామాలయం వెనుకభాగంలో చిరుత కనిపించిందని గ్రామస్తులు తెలిపారు.