జిల్లా ఎస్పీని కలిసిన షంషీర్ ఆలీ

ప్రకాశం: మార్కాపురం పట్టణానికి చెందిన మాజీ రాష్ట్ర ముస్లిం మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్, ఏ 1 గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాల ఛైర్మన్ డాక్టర్ మీర్జా షంషీర్ అలీ బేగ్ ఆదివారం ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్‌ను ఒంగోలులో జిల్లా పోలీస్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందచేసి సత్కరించారు. అనంతరం జిల్లాలో నెలకొన్న పలు అంశాలపై చర్చించారు.