BREAKING: ముగ్గురు జవాన్లు మృతి

జమ్మూకశ్మీర్‌లో ప్రమాదవశాత్తూ ఆర్మీ వాహనం లోయలో పడింది. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు చనిపోగా..పలువురికి గాయాలయ్యాయి. రాంభన్ జిల్లాలో 700 అడుగుల లోయలో ఆర్మీ కాన్వాయ్‌లోని వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి పడిపోయింది. జమ్మూ నుంచి శ్రీనగర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కాగా, ఈ ఘటన గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.