ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు
SRCL: తంగళ్ళపల్లి మండలం గోపాల్ రావు పల్లి, తాడూరులో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను కాంగ్రెస్ నాయకులు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ తంగళ్ళపల్లి మండల అధ్యక్షుడు టోనీ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్లతో పేదవాడి కళ నెరవేరింది అన్నారు. పేదల పక్షపాతిగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. మార్కెట్ కమిటీ వైస్‌ఛైర్మన్ నర్సింగం, రాజు ఉన్నారు.