సామాన్య వ్యక్తిగా చెట్టు కింద ఎమ్మెల్యే భోజనం
NLG: స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే వేముల వీరేశం వినూత్నంగా కనిపించారు. సోమవారం కట్టంగూర్ మండల పర్యటన సందర్భంగా మార్గ మధ్యలో ఆయన ఒక సామాన్య వ్యక్తిగా చెట్టు కింద రాయి మీద కూర్చొని భోజనం చేశారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.