ఆకేరువాగు ఇసుక ఫిల్టర్ కార్మికులకు ఉపాధి ఇబ్బందులు

ఆకేరువాగు ఇసుక ఫిల్టర్ కార్మికులకు ఉపాధి ఇబ్బందులు

WGL: వర్ధన్నపేట నియోజకవర్గంలోని ఆకేరువాగు పరివాహక ప్రాంతాల్లో ఇసుక ఫిల్టర్ పనిపై ఆధారపడి జీవిస్తున్న సుమారు 5,000 కుటుంబాలు ఉపాధి సమస్యలను ఎదుర్కొంటున్నాయని గురువారం అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే నాగరాజు తెలిపారు. ప్రస్తుత ఇసుక పాలసీలో వీరికి అవకాశం లేకపోవడంతో జీవనోపాధి దెబ్బతిన్నదని పేర్కొన్నారు. జీపీ రాయల్టీతో అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.