సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు: కలెక్టర్

WNP: రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జిల్లాలో అన్ని ముందస్తు చర్యలుచేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. కలెక్టరేట్‌లో వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో బుధవారం కలెక్టర్ సమీక్షనిర్వహించారు. దోమల నుంచి డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గునియా, డయేరియా వంటి వ్యాధుల బారిన పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.