'అభివృద్ధి చెందుతున్న నగరాలకు విద్య ప్రధాన శక్తి'
MBNR: అభివృద్ధి చెందుతున్న నగరాలకు విద్య ప్రధాన శక్తి అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి విద్యార్థులకు డిజిటల్ కంటెంట్ మెటీరియల్‌ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థికి పదవ తరగతి ఒక మైలురాయి లాంటిదని అన్నారు. సమయాన్ని వృధా చేయకూడదని వారికి వెల్లడించారు.