విద్యార్థులకు నోట్ బుక్స్ అందజేసిన కలెక్టర్

విద్యార్థులకు నోట్ బుక్స్ అందజేసిన కలెక్టర్

KMR: మాచారెడ్డి మండలం సోమవార్పేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల ప్రాంగణంలో పరిశుభ్రత పరిస్థితులను పరిశీలించారు. పాఠశాల ఆవరణలో చెత్త కనిపించకుండా శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పాఠశాల సిబ్బందికి సూచించారు. అనంతరం పదో తరగతి విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేశారు.