మాజీ సర్పంచ్‌కు కొవ్వత్తులతో ఘనంగా నివాళి

మాజీ సర్పంచ్‌కు కొవ్వత్తులతో ఘనంగా నివాళి

WGL: జిల్లా గంగాదేవిపల్లి ఆదర్శ గ్రామ మాజీ సర్పంచ్ రాజమౌళి ఇటీవల అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దిన ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ శనివారం రాత్రి మహిళా సంఘాలు కొవ్వత్తులతో భారీ ర్యాలీ నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. మాజీ సర్పంచ్ ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యువత ఉన్నారు.