మృణాల్ ఠాకూర్ కొత్త మూవీ టీజర్ రిలీజ్
బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్, సిద్ధాంత్ చతుర్వేది జంటగా సినిమా రాబోతుంది. జీ స్టూడియోస్, భన్సాలీ ప్రొడక్షన్స్ నిర్మించనున్న ఈ సినిమాకు 'దో దీవానే షెహర్ మే' అనే టైటిల్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారు. ఈ మేరకు దీని టీజర్‌ను రిలీజ్ చేశారు. ఇక లవ్ స్టోరీ డ్రామాతో రాబోతున్న ఈ చిత్రానికి రవి ఉద్యవార్ దర్శకత్వం వహించనున్నాడు. 2026 FEB 26న విడుదల కాబోతుంది.