'పీవీటీజీ గ్రామంలో కనీస సౌకర్యాలు కల్పించాలి'

'పీవీటీజీ గ్రామంలో కనీస సౌకర్యాలు కల్పించాలి'

ASR: పాడేరు మండలం ఉప్పెడుపుట్టు మెట్టవీధి పీవీటీజీ గ్రామంలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పీ.అప్పలనర్స, మండల కార్యదర్శి ఎల్.సుందరరావు కోరారు. గ్రామస్తులతో కలిసి బుధవారం పాడేరులో జాయింట్ కలెక్టర్ అభిషేక్‌కు వినతిపత్రం అందజేశారు. మెట్టవీధిలో సుమారు 200 మంది గిరిజనులు జీవిస్తున్నారన్నారు. తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.