నల్గొండను సస్యశ్యామలం చేస్తాం: ఉత్తమ్

నల్గొండను సస్యశ్యామలం చేస్తాం: ఉత్తమ్

TG: SLBC టన్నెల్ ప్రమాదంతో పనులు ఆగిపోయాయని మంత్రి ఉత్తమ్‌కుమార్ అన్నారు. జాతీయ స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. కమిటీ సూచనతో SLBC పనులపై ముందుకెళ్తామని స్పష్టం చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని భరోసా కల్పించారు. రాష్ట్రంలో ఉచితంగా సన్నబియ్యం ఇస్తున్నామని పేర్కొన్నారు.