ఆర్టీసీ బస్సుపై కూలిన చెట్టు

ఆర్టీసీ బస్సుపై కూలిన చెట్టు

RR: హయత్ నగర్‌లో గాలివాన బీభత్సం సృష్టించింది. ఆదివారం సాయంత్రం వచ్చిన బలమైన ఈదురుగాలులకు హయత్ నగర్ డిపోలో పార్కింగ్ చేసిన ఆర్టీసీ బస్సు మీద భారీ వృక్షం విరిగిపడింది. దీంతో బస్సు సగభాగం డ్యామేజ్ అయింది. ఈ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని డిపో సిబ్బంది తెలిపింది.