బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని వినతి
KRNL: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ విద్యార్థి సమైక్య సంఘ నాయకులు జిల్లా కలెక్టర్ సిరికి వినతిపత్రం అందజేశారు. బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆనందబాబు మాట్లాడుతూ.. బీసీల ప్రాతినిధ్యం తక్కువగా ఉండటంతో సామాజిక న్యాయం కోసం రిజర్వేషన్లు అత్యవసరమని, ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు.