సిమెంటు రోడ్డు పనుల ప్రారంభం
KDP: ఖాజీపేట మండలం సుంకేసుల హరిజనవాడలో సిమెంటు రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. పల్లె పండుగ 2.0 కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు చంద్ర భాస్కర్ రెడ్డి తెలిపారు. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.