పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరపాలి: ఎస్పీ
MHBD: జిల్లాలో పంచాయతీ ఎన్నికల కోసం పటిష్టమైన భద్రత ఏర్పాట్లు పూర్తిచేశామని ఎస్పీ శభరీష్ తెలిపారు. పోలీసు అధికారులతో ఇవాళ ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల విధుల్లో ఐదుగురు DSPలు, 16 మంది సీఐలు, 60 మంది ఎస్సైలు, 1000మంది సిబ్బంది పాల్గొంటారన్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలకు తావులేకుండా చూడాలని, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు.