'క్షయ రహిత సమాజం కోసం కృషి చేయాలి'

NLG: క్షయ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. గురువారం మునుగోడులో గల అధికారిక క్యాంప్ కార్యాలయంలో క్షయ వ్యాధికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొనాలన్నారు.