కాంగ్రెస్ నుంచి BRS చేరిక
WGL: నెక్కొండ మండల కేంద్రంలోని సాయి రెడ్డి పల్లె గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు శుక్రవారం BRS పార్టీలోకి చేరినట్లు మాజీ సర్పంచ్ బుల్లెబోయిన వీరస్వామి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చడంలో విఫలమైందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో BRS పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని ప్రజలకు పిలిపించారు.