ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
KMM: ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువతులకు ఏసీ మెకానిక్ పై ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు డైరెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. 30రోజుల శిక్షణతో పాటు భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈనెల 18లోగా ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలోని తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.