రేపు మంచినీటి సరఫరాకు అంతరాయం

రేపు మంచినీటి సరఫరాకు అంతరాయం

కృష్ణా: గుడివాడ పురపాలక సంఘంలో అన్ని రిజర్వాయర్లకు హెడ్ వాటర్ వర్క్స్‌లో 24/7 మోటార్లతో పూర్తిస్థాయి మంచినీటి సరఫరా జరుగుతుంది. ఇవాళ కురిసిన అకాల వర్షం కారణంగా హెడ్ వాటర్స్ వర్క్‌కు వచ్చే పవర్ సప్లైకు అంతరాయం కలిగింది. దీంతో శుక్రవారం పట్టణంలో మంచినీటి సరఫరాకు పూర్తిస్థాయి అంతరాయం ఏర్పడుతుందని మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్ తెలిపారు.